Viral Video: హృదయవిదారక ఘటన... అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో..

Viral Video: మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది.

Arun Chilukuri
Published on: 13 Feb 2023 11:44 AM IST
Six-Year-Old Boy Takes Father To Hospital In Pushcart In Madhya Pradesh
X

Viral Video: హృదయవిదారక ఘటన... అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో..

Viral Video: మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని తల్లి సాయంతో ఏడేళ్ల కుమారుడు తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అంబులెన్స్​రాకపోవడంతో మూడు కిలోమీటర్లు తన తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బాధితుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడని, 20 నిమిషాలైనా అంబులెన్స్​రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు 108కి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story