ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

Arun Chilukuri
Published on: 26 Aug 2020 1:36 PM IST
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
X

Six died in Uttar Pradesh bus accident: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బస్సులు ఒకదానికితో ఒ‍కటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్నో నగర శివార్లలోని కకోరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, యూపీ రోడ్‌వేస్ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ల‌క్నో నుంచి హ‌ర్దోయ్‌కి వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌కు చెందిన బ‌స్సు హ‌ర్దోయ్ నుంచి ల‌క్నో వ‌స్తున్న మరో బస్సు ఢీకొన్నాయ‌ని లా అండ్ ఆర్డ‌ర్ జాయింట్ క‌మిష‌న‌ర్ న‌వీన్ ఆరోరా చెప్పారు. కాగా, ఘ‌ట‌న విష‌యం తెలియ‌గానే యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్య‌క్తంచేశారు. క్ష‌తగాత్రులు స‌రైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అక్క‌డి అధికారుల‌ను ఆదేశించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story