గోవధ చేస్తే జైలుకే.. యోగీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్

గోవధ చేస్తే జైలుకే.. యోగీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్
x
Highlights

గోసంరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తున్న యూపీ ప్రభుత్వం దానిపై మరింత ముందుకు వెళ్లింది. ఇంతవరకు గోవధ నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసినా, దాన్ని కఠిన చట్టం...

గోసంరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తున్న యూపీ ప్రభుత్వం దానిపై మరింత ముందుకు వెళ్లింది. ఇంతవరకు గోవధ నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసినా, దాన్ని కఠిన చట్టం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం భవిషత్తులో గోవును చంపితే కారాగారం తప్పే అవకాశం లేదు.

యూపీలోని యోగీ సర్కార్ మరో సంచనలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి గో సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గోవధను అరికట్టేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరైనా గోవును వధిస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ యోగీ సర్కార్ తాజాగా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. దీనిని గవర్నర్ కూడా ఆమోధించారు. దీని ప్రకారం.. ఇకపై ఎవరైన తొలిసారి గోవధ చేస్తూ పట్టుబడితే వారికి ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇక రెండో సారి కూడా గోవధ చేస్తూ పట్టుబడితే. పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. గోవధ నివారణ చట్టం 2020 పేరుతో ఈ ఆర్డినెన్స్‌ను యోగీ ప్రభుత్వం తీసుకొచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories