Shrey Hospital Sealed : శ్రేయ్ హాస్పిట‌ల్ సీజ్‌‌

Shrey Hospital Sealed : అహ్మదాబాద్ లో కోవిడ్ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం

Krishna
Published on: 6 Aug 2020 1:03 PM IST
Shrey Hospital Sealed : శ్రేయ్ హాస్పిట‌ల్ సీజ్‌‌
X
Shrey Hospital has been Sealed in Ahmedabad

Shrey Hospital Sealed : అహ్మదాబాద్ లో కోవిడ్ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ప్రమాదంలో ఎనమిది మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. ఇందులో ఐదుగురు పురుషులు ఉండగా, ముగ్గురు మహిళలు ఉన్నారు మరికొందరు గాయపడ్డారు. రోగుల చావుకు కార‌ణ‌మైన శ్రేయ్ ద‌వాఖాన‌ను అధికారులు అధికారులు సీజ్ చేశారు. అందులోని 41 మంది రోగుల‌ను స‌ర్దార్ వ‌ల్లభాయ్‌ప‌టేల్ ఆసుపత్రికి తరలించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అద‌న‌పు ప్రధాన కార్యద‌ర్శి రాజీవ్ కుమార్ గుప్తా వెల్లడించారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ముందుగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఐసీయూలో తొలుత మంటలు వ్యాపించాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన పైన ప్రధాని మోడీ స్పందించారు. అహ్మదాబాద్‌లో ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి 2 లక్షలు చొప్పున ఇవ్వబడుతుంది . ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు పిఎం మోడీ తెలిపారు.

Krishna

Krishna

Next Story