Covid-19 Hospital Fire : కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

Covid-19 Hospital Fire :గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనమిది మంది

Krishna
Published on: 6 Aug 2020 12:07 PM IST
Covid-19 Hospital Fire : కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
X

Covid-19 Hospital Fire :గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనమిది మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు మరికొందరు గాయపడ్డారు. మృతదేహాలని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఇక ఆస్పత్రిలో వ్యర్థాలకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు 40 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందుగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఐసీయూలో తొలుత మంటలు వ్యాపించాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన పైన ప్రధాని మోడీ స్పందించారు. అహ్మదాబాద్‌లో ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి 2 లక్షలు చొప్పున ఇవ్వబడుతుంది . ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు పిఎం మోడీ తెలిపారు.

ఇక బుధవారం నాడు 1,073 కొత్త కరోనావైరస్ లు గుజరాత్ రాష్ట్రంలో నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 66,777 కు చేరుకుంది. మృతుల సంఖ్య 2,557 కు పెరిగిందని వైద్య అధికారులు తెలిపారు.




Krishna

Krishna

Next Story