అనారోగ్యంతో ప్రముఖ నటుడు కన్నుమూత

Raj
By Raj
Published on: 11 Jun 2020 7:01 PM IST
అనారోగ్యంతో ప్రముఖ నటుడు కన్నుమూత
X

శ్రీ గణేష్ , అమితా కా అమిత్ వంటి టీవీ షోలలో నటించి పేరుగాంచిన జగేష్ ముకాటి బుధవారం ముంబై ఆసుపత్రిలో మరణించినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఆయన వయసు 47 సంవత్సరాలు. ఆయన కొన్నేళ్లుగా స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్నారు. దానికి తోడు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ముకాటి సన్నిహితుడు పిటిఐకి చెప్పారు. ఇటీవల జగేష్ కు శ్వాస అందక పోవడంతో అస్వస్థతకు లోనయ్యారు.

దీంతో ఆయనను జూన్ 5న ముంబైలోని ఆసుపత్రికి తరలించారు.. అయితే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో తను ప్రాణాలు వదిలాడు' అని ఉద్వేగానికి లోనయ్యాడు. జగేష్ ముకాటికి COVID-19 పరీక్షలు చేయగా నెగటివ్ అని వచ్చింది. కాగా జగేష్ ముకాటి సిద్ధార్థ్‌ మల్హోత్రా- పరిణీతి చోప్రాల 'హసీ తో ఫసీ', ఆమిర్‌ ఖాన్‌ 'మన్‌' సినిమాలో నటించారు.

Raj

Raj

Next Story