Sharad Pawar: రాష్ట్రపతి రేసులో లేను

Sharad Pawar: పీకే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవం * సమావేశంలో రాజకీయాలు ప్రస్తావనకు రాలేదు -శరద్ పవార్

Sandeep Eggoju
Updated on: 15 July 2021 1:04 PM IST
Sharad Pawar Says Im Not in the Race of President Election
X
శరద్ పవర్ (ఫైల్ ఇమేజ్)

Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు ప్రారంభించారన్న వార్తలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్వయంగా స్పందించారు. తనను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడానికి పీకే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలన్నీ నిరాధారమైన, అసత్యపు ఆరోపణలని స్పష్టం చేశారు. అలాంటిదేమీ లేదని, అసలు అలాంటి వాతావరణమే దేశంలో ఉత్పన్నం కాదని కుండబద్దలు కొట్టారు. ఏయే లెక్కలు వేసుకొని, తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తేవాలని ప్రశాంత్ కిషోర్ అనుకున్నారో తనకు తెలియదని, తమ భేటీ సందర్భంగా రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకే రాలేదని పవార్ వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల అంశం కూడా తమ మధ్య చర్చకు రాలేదని పవార్ ప్రకటించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story