Air India: తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు..

Shankar Mishra Arrested For Peeing On Woman On Air India Plane
x

Air India: తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు..

Highlights

Air India: ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.

Air India: ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. మిశ్రా గత ఏడాది నవంబర్‌లో న్యూయార్క్‌ నుంచి న్యూ ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నవంబర్ 26, 2022న ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేసిన ఆరోపణలను అనుసరించి, పోలీసులు మిశ్రాపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు పైలట్‌తో సహా ఎయిర్‌లైన్‌లోని 8 మంది సిబ్బందికి సమన్లు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories