మణిపూర్‌లో రెండో రోజు రాహుల్‌ న్యాయ్‌ యాత్ర

Rahul Gandhi: నిన్న ధోబల్‌ జిల్లా నుంచి ప్రారంభమైన రాహుల్‌ యాత్ర

Jyothi
Published on: 15 Jan 2024 10:05 AM IST
Second Day of Rahul Nayya Yatra in Manipur
X

మణిపూర్‌లో రెండో రోజు రాహుల్‌ న్యాయ్‌ యాత్ర

Rahul Gandhi: ఏడాదిన్నర కిందట భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3వేల500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... ఎన్నికలకు ముందు మళ్లీ జనం బాటపట్టారు. మణిపూర్‌ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మణిపూర్‌లోని తౌబల్‌ జిల్లాలో ఓ ప్రైవేట్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించారు. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత్ న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా కాలినడకన, బస్సులో మొత్తంగా 6వేల, 700కిపైగా కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మార్చి 20న ముంబయిలో ఈ యాత్ర ముగుస్తుంది.

మణిపూర్, నాగాలాండ్ మీదుగా జనవరి 18 నాటికి ఈ యాత్ర అసోంకి చేరుకుంటుంది. ఇది ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో వెనుకబడిన వర్గాలు గొంతుకను వినిపించేందుకే రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్నట్టు తేల్చి చెప్పింది. అందరికీ న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story