UP Assembly: బీజేపీ ఎమ్మెల్యేల తీరు.. ఆన్‭లైన్‭లో పేకాడుతూ ఒకరు.. హౌజ్‭లోనే తంబాకు తింటూ మరొకరు..

UP Assembly: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నేతలు వింత కార్యకలాపాలు చేస్తూ కెమెరాకు చిక్కారు.

Arun Chilukuri
Published on: 24 Sept 2022 6:20 PM IST
UP Assembly: బీజేపీ ఎమ్మెల్యేల తీరు.. ఆన్‭లైన్‭లో పేకాడుతూ ఒకరు.. హౌజ్‭లోనే తంబాకు తింటూ మరొకరు..
X

UP Assembly: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నేతలు వింత కార్యకలాపాలు చేస్తూ కెమెరాకు చిక్కారు. సభ కొనసాగుతుండగా ఒక బీజేపీ ఎమ్మెల్యే పేకాటాడుతుండగా మరొక బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీలోకే తంబాకు తెచ్చుకున్నారు. సభలోనే తంబాకు నమిలారు. వీరిద్దరి వీడియోలను సమాజ్‭వాదీ పార్టీ సోషల్ మీడియాలో బహిర్గత పర్చింది. అసెంబ్లీ కొనసాగుతుండగా ఓ మహిళా సభ్యురాలు సభలో ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో సభ్యుడొకరు మొబైల్‭లో పేకాట ఆడుతుండడం మరో ఎమ్మెల్యే సభలోనే తంబాకు నోట్లో వేసుకోవడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రజల సమస్యలకు వీళ్లు సమాధానాలు ఇవ్వరని పైగా అసెంబ్లీ వీరికి వినోద ప్రదేశంగా ఉండాలనుకుంటారంటూ సమాజ్‌వాది పార్టీ ట్వీట్ చేసింది. చాలా అసహ్యకరమైన ఘటన ఇది అంటూ రాష్ట్రానికి చాలా అవమానకరమని ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story