Sabarimala: శబరిమల మకరజ్యోతి దర్శనం

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు

Shekhar G
Updated on: 15 Jan 2024 6:15 PM IST
sabarimala makara jyothi darshanam
X

Shabarimala: శబరిమల మకరజ్యోతి దర్శనం

Sabarimala: శబరిమలలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. పొన్నాంబలమేడు కొండపై నుంచి మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఈ మకరజ్యోతిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పోటెత్తుతున్నారు. కొండపై ఇప్పటికే లక్షలాది మంది అయ్యప్ప స్వాములు మకర జ్యోతి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మరోవైపు.. 10 చోట్ల వ్యూపాయింట్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా దగ్గర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వాములు ఎదురుచూస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story