కాసేపట్లో తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం

శబరిమల ఆలయ ద్వారాలు.. తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 27 వరకు అయ్యప్పుకు నిత్య పూజలు నిర్వహిస్తారు.

admin1
Updated on: 16 Nov 2019 7:07 PM IST
ayyappa temple kerala
X
ayyappa temple kerala

శబరిమల ఆలయ ద్వారాలు.. తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 27 వరకు అయ్యప్పుకు నిత్య పూజలు నిర్వహిస్తారు. ఇటు ఆలయ పరిసరాల్లో 10 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పంబ దగ్గరకు వేలాదిగా అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. అయితే అయ్యప్పను దర్శించుకునేందుకు వస్తున్న వారిలో మహిళలు కూడా ఉండటంతో.. కలకలం రేగుతోంది. పలువురు మహిళలు రావడంతో వారిలో ఇప్పటివరకు 10 మంది మహిళలను కేరళ పోలీసులు వెనక్కు పంపించారు. వీరిలో తెలుగు మహిళలు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలను దర్శనానికి పంపడం కుదరదని తేల్చిచెప్పారు.

ఇటీవల శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై విచారించిన సుప్రీం ధర్మాసనం.. భక్తి విశ్వాసాలపై మరింత విచారణ చేపట్టేందుకు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపించింది. దీంతో ఈ అంశం.. మళ్లీ మొదటికొచ్చినట్లైంది. ఈ అంశంపై వాదనలను విస్తృత ధర్మాసనం ముందు మరోసారి విన్నవించాల్సి ఉంటుంది.

admin1

admin1

Next Story