TOP 6 News @ 6PM: Rythu Bharosa scheme: రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు పడతాయంటే...

telangana rythu bharosa scheme reasons for delayed payments eligibility issues  for farmers to claim funds
x

 Rythu Bharosa: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ త్వరలోనే రైతు భరోసా..!!

Highlights

1) రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లోకి వచ్చేదెప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులకు ఎకరాకు 12 వేలు చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన...

1) రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లోకి వచ్చేదెప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో రైతులకు ఎకరాకు 12 వేలు చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకంపైనే ఇప్పుడు చాలామంది దృష్టి ఉంది. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై క్లారిటీ ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించిన పథకాల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ అర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాతి నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం డబ్బులు జమ అవడం ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

2) నన్ను కొట్టిన వ్యక్తిని గుర్తించాను - రఘురామ కృష్ణం రాజు

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ నిందితుల ఐడెంటిఫికేషన్ పరేడ్ జరిగింది. నిందితులను గుర్తించడం కోసం రఘురామ కృష్ణం రాజు ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. ఈ కేసులో తులసి బాబు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తులసి బాబు కోర్టుకు చెప్పారు. దీంతో తనపై దాడి చేసింది ఎవరో గుర్తించాల్సిందిగా పోలీసులు రఘురామ కృష్ణం రాజును కోరారు.

పోలీసుల సూచన మేరకే ఇవాళ ఆయన జిల్లా జైలుకు వచ్చి జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని చూపించానని అన్నారు. న్యాయమూర్తి కూడా తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు రఘురామ కృష్ణం రాజు మీడియాకు తెలిపారు.

3) గుర్తుపెట్టుకోండి.. ఇక రేపటి నుంచి రణరంగమే - భట్టికి కేటీఆర్ వార్నింగ్

KTR Warns Telangana govt: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ? మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా అని కేటీఆర్ నిలదీశారు.

మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా లేక మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా ? అని ప్రశ్నిస్తూ నాడు "అందరికీ అన్నీ అని చెప్పి నేడు కొందరికే కొన్ని అంటే ఎలా అని అడిగారు.

పథకాల పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ మిమ్మల్ని క్షమించదని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

4) సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్... ఆ వేలిముద్రలు నిందితుడివి కావు

Saif Ali Khan case latest news updates: సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైఫ్ ఇంట్లో దాడి ఘటన అనంతరం సేకరించిన 19 రకాల వేలిముద్రలు నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదు. సైఫ్ ఇంట్లో దాడి తరువాత ముంబై క్రైమ్ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. ఆ వేలిముద్రలను ముంబైలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లోని ఫింగర్ ప్రింట్ విభాగానికి పంపించారు. ఆ తరువాత ఈ కేసులో బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి నిందితుడిగా చూపించారు. షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు సేకరించి సీఐడీలోని ఫింగర్ ప్రింట్స్ విభాగానికి పంపించారు.

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సేకరించిన వేలిముద్రలతో షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మ్యాచ్ అవడం లేదని రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ నెగటివ్ రావడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు దర్యాప్తు కోసం పంపించినట్లు సమాచారం అందుతోంది.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి 11 రోజులు అవుతోంది. జనవరి 15న రాత్రి బాంద్రాలో సైఫ్ నివాసం ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 70 గంటల తరువాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడు షరీఫుల్ ఇస్లాం కూడా తనే ఈ నేరానికి పాల్పడినట్లుగా అంగీకరించారు. తను వెళ్లింది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అనే విషయం కూడా తనకు తెలియదని షరీఫుల్ ఇస్లాం తన వాంగ్మూలంలో రాసిచ్చినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు. ఇంతలోనే ఇప్పుడిలా వేలిముద్రలు మ్యాచ్ అవడం లేదని రిపోర్ట్ రావడం మరో కొత్త ట్విస్టుగా కనిపిస్తోంది.

5) Unified Pension Scheme : పెన్షన్ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: UPS గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Unified Pension Scheme : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రకటించేందుకు కొన్ని రోజుల ముందు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) పై అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త స్కీమ్ 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. యూపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ (OPS),జాతీయ పెన్షన్ స్కీమ్ (NPS) ల మధ్య సమతుల్యతను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత హామీ పింఛన్ కల్పించేందుకు రూపొందించబడింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) PM Gati Shakti: భారత అభివృద్ధిని నిర్ణయించనున్న 434 మెగా ప్రాజెక్టులు

PM Gati Shakti: భారత అభివృద్ధిని నిర్ణయించే 434 మెగా ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.17 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ప్రధాన మంత్రి గతి శక్తి యోజన కింద అమలుకానున్న ఈ ప్రాజెక్టులు భారతదేశ లాజిస్టిక్ రంగాన్ని పూర్తిగా మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టుల ద్వారా రోడ్లు, రైళ్లు, నీటిమార్గాలు, విమాన రవాణా రంగాల్లో మెరుగుదల తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోర్ట్ కనెక్టివిటీ, హై ట్రాఫిక్ డెన్సిటీ రూట్లు, ఎనర్జీ-మినరల్-సిమెంట్ కారిడార్లు నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories