Putin: రేపు భారత్‌కు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌

Putin: భారత్-రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రేపు భారత్‌ రానున్నారు

Sandeep Eggoju
Published on: 5 Dec 2021 4:19 PM IST
Russia President Putin to visit India Tomorrow
X

రేపు భారత్‌కు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌ (ఫైల్-ఫోటో)

Putin: భారత్-రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రేపు భారత్‌ రానున్నారు. వార్షిక సదస్సులో భాగంగా రేపు ఢిల్లీకి రానున్న పుతిన్ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం సాంకేతిక రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు భారత్-రష్యా మధ్య రక్షణ రంగంలో భాగంగా 200 హెలికాప్టర్ల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశముంది. ఇదే సమయంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story