దేశంలోని పేదలను ఆడుకోవాలంటే 65 వేల కోట్ల రూపాయలు అవసరం : రాహుల్ గాంధీ తో రఘురామ్ రాజన్

దేశంలోని పేదలను ఆడుకోవాలంటే 65 వేల కోట్ల రూపాయలు అవసరం : రాహుల్ గాంధీ తో  రఘురామ్ రాజన్
x
Rahul Gandhi video conversation with Raghuram Rajan (Photo from video)
Highlights

దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ తో దెబ్బతిన్న పేదలకు సహాయం చేయడానికి సుమారు రూ .65,000 కోట్లు అవసరమవుతాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ చెప్పారు.

దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ తో దెబ్బతిన్న పేదలకు సహాయం చేయడానికి సుమారు రూ .65,000 కోట్లు అవసరమవుతాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ చెప్పారు.

రాహుల్ గాంధీ ఈరోజు రఘురాం రాజన్ తో వీడియో ఇంటరాక్షన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ లాక్ డౌన్ నేపధ్యంలో భారత దేశం ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా పేదలను పూర్తిగా ఆడుకోవాలంటే ఎంత డబ్బు అవసరం అవుతుంది అనే విషయాలపై రఘురామ్ రాజన్ ను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకూ ఉన్న పరిస్థితులను పరిగణన లోకి తీసుకుంటే దేశంలోని పేదలను ఆడుకోవడానికి 65,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పారు రఘురాం. అయితే, అంత నిధులు సర్దుబాటు చేసుకోవడం ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వానికి కష్టమే అని అభిప్రాయపడ్డారు.

దీర్ఘకాలిక లాక్ డౌన్ ఆర్ధిక వ్యవస్థకు అంత మంచిది కాదని ఆయన చెప్పారు. లాక్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగించడం సులువైన విషయమే కానీ, ఆర్ధిక వ్యవస్థకు మాత్రం అది చాల చెరుపు చేస్తుందని చెప్పారు.

లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక పక్క కరోనాను కట్టడి చేస్తూనే.. మరో పక్క లాక్ డౌన్ సడలించే చర్యాలు చేపట్టాలి. ఎందుకంటే, భారత్ కు ఎక్కువ కాలం ఆహార పదార్ధాలు ప్రజలకు ఇవ్వగల సామర్ధ్యం లేదు. అందువల్ల పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను వేరు చేస్తూ.. క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేసే విధంగా భారత్ వ్యవహరించాల్సి ఉంటుందని మాజీ ఆర్ బీ ఐ చీఫ్ రఘురాం రాజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించారు.

రాహుల్ గాంధీ..రఘురాం రాజన్ మధ్య జరిగిన వీడియో కన్వర్సేషన్ మీరూ ఇక్కడ చూడొచ్చు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories