Chhattisgarh: ఘోర రోడ్డుప్రమాదం.. 14 మంది మృతి

Chhattisgarh: మహా మాయ గుడి వద్ద అదుపుతప్పి లోయపడిపోయిన బస్సు

Jyothi
Published on: 10 April 2024 7:42 AM IST
Road Accident In Chhattisgarh
X

Chhattisgarh: ఘోర రోడ్డుప్రమాదం.. 14 మంది మృతి

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌ దుర్గ్‌ జిల్లా కుంహారి పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మహా మాయ గుడి వద్ద బస్సు అదుపుతప్పి 50 అడుగుల లోయపడిపోయింది. ప్రమాదంలో డిస్టలరీస్‌ కంపెనీకి చెందిన 14 మంది మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story