జైలు నుంచి రియా చక్రవర్తి విడుదల..మీడియాకు ముంబయి పోలీసుల హెచ్చరిక

జైలు నుంచి రియా చక్రవర్తి విడుదల..మీడియాకు ముంబయి పోలీసుల హెచ్చరిక
x
Highlights

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియాచక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే. అయితే నటి రియాచక్రవర్తి తనకు బెయిల్ కావాలంటూ బాంబే...

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియాచక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే. అయితే నటి రియాచక్రవర్తి తనకు బెయిల్ కావాలంటూ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకోగా హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో సుమారు నెలరోజుల పాటు బైకుల్లా జైలులో ఉన్న రియా చక్రవర్తి బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే ఆమె తన కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ముంబయి ముంబయి డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సంగ్రామ్ సింగ్ నిశాందర్ మీడియాను హెచ్చరించారు. మీడియా వ్యక్తులు న్యాయవాదుల్ని ఎవరినీ కూడా ఇంటర్వ్యూల కోసం వెంటాడకూడదని, అలాగే ప్రముఖుల వాహనాల్ని కూడా ఛేజ్‌ చేయకూడదని తెలిపారు. మీ జీవితాల్ని, సదరు సెలబ్రిటీ జీవితాన్ని, అలాగే రోడ్డుపై ఉన్న వారి జీవితాల్ని అపాయంలోకి నెట్టకూడదని ఆయన అన్నారు. అలా చేస్తే దాన్ని నేరం కింద పరిగణిస్తామని, అటు డ్రైవర్‌ పైన, అతడు అలా నడపడానికి కారణమైన వ్యక్తిపైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇటీవలె సుశాంత్‌ కేసుకు సంబంధించి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు విచారించిన సంగతి విదితమే. అయితే విచారణకు రియా చక్రవర్తి హాజరయ్యేందుకు వచ్చే సమయంలో ఆమె చుట్టూ మీడియా వ్యక్తులు గుమిగూడి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మీడియా ప్రతినిధులు కరోనా వేళ సామాజిక దూరం కూడా పాటించలేదు. రియా చుట్టూ భద్రత ఉన్నప్పటికీ మీడియాను దాటుకుంటూ ముందుకు వెళ్లడానికి రియా ఎంతో ఇబ్బందిపడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో కొంత మంది తీసిన ఫోటోలు, అలాగే వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలుస్తోంది.

ఇక సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ మృతి చెందిన తరువాత ఆ కేసు పూర్తిగా రియాచక్రవర్తి చుట్టే తిరుగుతుంది. ఈ కేసు విచారణలో సీబీఐ అధికారులు రియా సెల్‌ఫోన్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన చాటింగ్‌ను గుర్తించారు. ఆ ఆధారాలు బయటికి రాగానే అటు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. అనంతరం రియా ఆమెతో పాటు మరికొందరిని విచారించి అరెస్టు చేసింది. రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఎన్సీబీ అధికారులు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌ను కూడా విచారించారు. ఆ సమయంలో కూడా మీడియా ప్రతినిధులు వారి వాహనాల్ని కూడా ఛేజ్‌ చేసారు. దీంతో సంగ్రామ్‌ సింగ్‌ స్పందించి విచారణకు వస్తున్న ప్రతి సెలబ్రిటీ వాహనాన్ని మీడియా ఛేజ్‌ చేయడం మేం గమనించాం అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories