రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు

రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు
x
Highlights

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి ఇవాళ ముంబై హైకోర్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. రియా చ‌క్ర‌వ‌ర్తికి లక్ష...

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి ఇవాళ ముంబై హైకోర్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. రియా చ‌క్ర‌వ‌ర్తికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పదిరోజుల పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా గ్రేటర్‌ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు షరతు విధించింది.

అయితే రియా చక్రవర్తితోపాటు సుశాంత్‌ కేసులో అరెస్ట్‌ అయిన శామ్యూల్‌ మిరండా, దిపేశ్‌ సావంత్‌కు బెయిల్‌ మంజూరు చేయగా.. రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి మాత్రం బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జూన్‌ 14న తన నివాసంలో మృతి చెంది కనిపించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుశాంత్‌తో సన్నిహిత సంబంధాలున్న వారందర్నీ పోలీసులు విచారించి.. అనంతరం రియా చక్రవర్తిని గత నెలలో అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories