Ranya Rao: 15 కేజీల బంగారం స్మగ్లింగ్.. ప్రముఖ హీరోయిన్ అరెస్ట్

Ranya Rao:  15 కేజీల బంగారం స్మగ్లింగ్.. ప్రముఖ హీరోయిన్ అరెస్ట్
x
Highlights

Ranya Rao: బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న కారణంతో కన్నడ నటి రాన్యా రావ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఆమె తీసుకువచ్చిన దాదాపు 15కిలోల...

Ranya Rao: బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న కారణంతో కన్నడ నటి రాన్యా రావ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఆమె తీసుకువచ్చిన దాదాపు 15కిలోల బంగారాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాన్యా ఇటీవల తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై పోలీసులు నిఘా పెట్టారు. గత 15రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన రాన్యా ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చేవారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ప్లాన్ ప్రకారం తాజాగా ఆమెను అరెస్టు చేశారు. కర్నాటకకు చెందిన ఓ పోలీస్ అధికారికి రాన్యా బంధువని సమాచారం. డీఆర్ఐ అధికారులు ప్రశ్నించగా..తాను డీజీపీ కుమార్తెని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకుగాను ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిపింది. అసలు పోలీసు అధికారులకు రాన్యా సంబంధమేంటీ ఆ స్మగ్లింగ్ లో వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో డీఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories