GST శ్లాబులపై నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ కీలక వ్యాఖ్యలు

admin1
Published on: 25 Dec 2019 10:36 PM IST
GST శ్లాబులపై నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ కీలక వ్యాఖ్యలు
X
GST

వస్తు, సేవల పన్ను...GSTలో ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులకు బదులుగా 2 శ్లాబులు ఉంటే సరిపోతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ అన్నారు. అంతేగాక, జీఎస్‌టీ రేట్లను తరచుగా మార్చకుండా.. ఏడాదికోసారి సవరించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. జీఎస్‌టీ రేట్లను తరచుగా సవరించడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని రమేశ్ చంద్ అన్నారు..

అయితే ఒకవేళ తప్పనిసరిగా రేట్లను సవరించాల్సి వస్తే అది ఏడాదికోసారి మాత్రమే చేయాలని అన్నారు.. జీఎస్‌టీని తగ్గించాలని కోరడం ప్రతి రంగానికి అలవాటైపోయింది. అందుకే ఇలా ఎక్కువ శ్లాబులు కాకుండా కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటే బాగుంటుందని రమేశ్ చెప్పుకొచ్చారు.

admin1

admin1

Next Story