Top
logo

సుష్మాస్వరాజ్‌కు రాజ్యసభ నివాళి

సుష్మాస్వరాజ్‌కు రాజ్యసభ నివాళి
X
Highlights

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ ‌కు రాజ్యసభ ఘనంగా నివాళులర్పించింది. ...

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ ‌కు రాజ్యసభ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే తొలుత సుష్మాస్వరాజ్‌కు సభ్యులంతా నివాళులర్పించారు. తమ స్థానాల నుంచి లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్ హఠాన్మరణంతో ఒక సమర్ధవంతమైన పాలనాదక్షురాలిని, పార్లమెంటేరియన్‌ను, అసలు సిసలైన ప్రజావాణిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలసభలో సుష్మకు నివాళులర్పించిన వారిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.

Next Story