శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ సుధా నారాయణమూర్తి

తీర్థ ప్రసాదాలు అందించి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించిన పండితులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 18 May 2024 9:00 PM IST
Rajya Sabha MP Sudha Narayana Murthy Visited Tirumala Temple
X

శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ సుధా నారాయణమూర్తి

రాజ్యసభ ఎంపీ సుధా నారాయణమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సుధానారాయణ మూర్తికి వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు పండితులు. శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు సుధా నారాయణమూర్తి. ప్రజలకు మంచి చేసేందుకు శాయాశక్తులా కృషి చేస్తానని.. నిరంతరాయంగా ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story