Rajnath Singh: పాక్‌కు రాజ్‌నాథ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. దెబ్బకు చైనా సైలెంట్‌!

Rajnath Singh Slams Pakistan At SCO Summit
x

Rajnath Singh: పాక్‌కు రాజ్‌నాథ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. దెబ్బకు చైనా సైలెంట్‌!

Highlights

Rajnath Singh: దాయాదిదేశమైన పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Rajnath Singh: దాయాదిదేశమైన పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ భారత్ హక్కు అని, ఆయుధాలు చేతులో పట్టుకుని తిరుగుతున్న పాక్‌కు ఎప్పటికైనా నష్టమేనని, ఆ దేశంతో కలిసేదే లేదని తేల్చి చెప్పారు.

ఇటీవల చైనాలోని షాంఘైలో సహకార రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి, దాన్ని ఒక సాధనంగా వాడుతున్నాయి, తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి సహాయం చేస్తున్న దేశాలు అందుకు తగ్గ ఫలితాన్ని చూస్తాయని’ పరోక్షంగా పాక్ దేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ‘ ఈ దేశాలు ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాయని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని’ అని అన్నారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసేదే లేదని తేల్చి చెప్పారు.

అదేవిధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల చేత్తులో ఎలాంటి ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే దానికి నిర్ణయాత్మకమైన చర్యలు అవసరం. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్నా, భద్రతను కల్పించాలన్నా అలాంటి దేశాలతో పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని కూడా రాజ్ నాధ్ సింగ్ పిలుపునిచ్చారు. చివరగా, ఆపరేషన్ సింధూర్ భారత దేశ హక్కు అని, ఉగ్రవాదాన్ని అడ్డుకునేందు ఈ ఆపరేషన్‌ను నిర్వహించామని సమావేశంలో రాజ్ నాథ్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories