Rajinikanth: ప్రత్యేక విమానంలో అమెరికాకు రజనీకాంత్

Rajinikanth: హెల్త్ చెకప్ కోసం ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు రజనీకాంత్.

Kranthi
Updated on: 15 Jun 2021 2:57 PM IST
Rajinikanth Went USA for Medical Checkup
X

రజినీకాంత్ (ఫైల్ ఇమేజ్)

Rajinikanth: తలైవా ఆరోగ్యం మళ్లీ దెబ్బ తిందా? ఇదే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని.. తర్వాత సడెన్ గా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. ఆ తర్వాత పాలిటిక్స్ కి నో చెప్పేశారు. అప్పటి నుంచి మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చాక.. షూటింగులు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు సడెన్ గా అమెరికా వెళ్లారని తెలుస్తుండటంతో.. అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు.

ఈ ప్రచారంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే రజినీ ఆనారోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని సమాచారం. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం రజినీ అమెరికా వెళ్లారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే అనుమతి కోరుతూ సెంట్రల్ గవర్నమెంట్‌ కు లెటర్ రాశారు రజినీ. పర్మిషన్ రావడంతో సోమవారం మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్‌ లో కుటుంబసభ్యులతో కలిసి చెన్నై నుండి బయలుదేరారు. హెల్త్ చెకప్ తర్వాత కొన్ని రోజులు యూఎస్ లోనే ఉండి.. రిలాక్స్ అయిన తర్వాత ఇండియాకు తిరిగి రానున్నట్టు సమాచారం.

Kranthi

Kranthi

Next Story