Indian Railway: కరోనా వ్యాప్తి కట్టడికి రైల్వేశాఖ కీలక నిర్ణయం

Indian Railway: రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్ ధర ఒకేసారి రూ.20 పెంపు * రూ. 30కు చేరిన రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్ ధర

Sandeep Eggoju
Updated on: 5 March 2021 3:08 PM IST
Railways Key Decision for Controlling Corona Spreading
X

ఇండియన్ రైల్వేస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Indian Railway: కరోనా వ్యాప్తి కట్టడికి రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్ ధరను ఒకేసారి 20 రూపాయలు పెంచేసింది. పెరిగిన ధరతో 30కు చేరింది రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్ ధర. ప్లాట్ ఫాం టికెట్ ధరల పెంపుపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తేవాలని అన్ని జోన్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ధరలను తాత్కాలికంగా మాత్రమే పెంచినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నివారించడం తమ బాధ్యత అని పేర్కొన్న రైల్వేశాఖ రైల్వేస్టేషన్‌లలో ప్రజలు గుమిగూడడాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయమని తెలిపింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story