Rahul Gandhi: పెగాసస్‌ అంశంపై ఏకతాటిపైకి విపక్షాలు

Rahul Gandhi: పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించే ఆలోచనలో విపక్షాలు * కాసేపట్లో రాహుల్ గాంధీ అధ్యక్షతన విపక్షాల భేటీ

Sandeep Eggoju
Published on: 3 Aug 2021 11:03 AM IST
Rahul Gandhi Meets With Opposition Leaders
X
ఇతర పార్టీ నేతలతో రాహుల్ గాంధి మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: పెగాసస్‌ నిఘా అంశంపై ప్రతిపక్షాలు సంఘటితం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. పెగాసస్‌పై చర్చించాలంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్నా.. తిరస్కరణకు గురవుతుండటంతో కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాయి ప్రతిపక్షాలు.

ఇక విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పెగాసస్‌పై అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేందుకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. 14 పార్టీల నేతలకు అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానం పంపారు. కాసేపట్లో రాహుల్ గాంధీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, పార్లమెంట్‌కు పోటీగా మాక్‌ పార్లమెంట్‌ను నిర్వహించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story