Rahul Gandhi Letter: ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ లేఖ

Rahul Gandhi Letter: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కరోనా కట్టడి, ప్రజలకు సాయంపై ప్రధాని మోడీకి లేఖ రాసారు.

Arun Chilukuri
Published on: 8 May 2021 11:34 AM IST
Rahul Gandhi Letter to PM Narendra Modi
X

Rahul Gandhi Letter: ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ లేఖ


Rahul Gandhi Letter: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కరోనా కట్టడి, ప్రజలకు సాయంపై ప్రధాని మోడీకి లేఖ రాసారు. వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కరోనాతో దెబ్బతిన్నవారికి ఆర్థిక సాయం అందజేయాలని ఆ లేఖలో ప్రధానికి సూచించారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురు కరోనా బాధితుల్లో ఒకరు భారతీయుడే. దేశంలో వైరస్ శరవేగంగా అనేక మ్యుటేషన్లకు గురవుతోంది నియంత్రణ లేకపోతే దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు ముంచుకొస్తుందని రాహుల్ తన లేఖలో ప్ర‌ధానికి తెలిపారు. వైరస్ మ్యుటేషన్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అధ్యయనం చేసి..కొత్త మ్యుటేషన్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలని సూచించారు రాహుల్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story