India: దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణం - రాహుల్ గాంధీ

India: మదమెక్కిన ఈ ప్రభుత్వానికి మంచి మాటలు గిట్టవని మండిపడ్డారు.

Sandeep Eggoju
Published on: 11 April 2021 12:08 PM IST
Rahul Gandhi Fires on Central Government for Corona Spreading in India
X

రాహుల్ గాంధీ (ఫైల్ ఇమేజ్)

India: దేశంలో కరోనా వైరస్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మదమెక్కిన ఈ ప్రభుత్వానికి మంచి మాటలు గిట్టవని మండిపడ్డారు. వలస కార్మికులు మరోసారి పొట్ట చేత పట్టుకుని నగరాలను వీడాల్సిన పరిస్థితి తలెత్తింది అని ఆవేదన వ్యక్తం చేశారు. టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేయడంతో పాటు ప్రభుత్వం డబ్బు అందించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థకు, సామాన్య పౌరుడికి ఇది చాలా అవసరమన్నారు. భారత ప్రజలకు కావాల్సింది ఉద్యోగాలు, టీకాలు. కానీ ప్రభుత్వం వాటికి బదులుగా అబద్ధాలు, అవమానాలనే అందిస్తోంది అని ట్వీట్‌లో రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story