పుదుచ్చేరిలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు రద్దు

Samba Siva Rao
Published on: 9 Jun 2020 4:28 PM IST
పుదుచ్చేరిలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు రద్దు
X

కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వి. నారాయణ సామి వెల్లడించారు. తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల త‌ర‌హాలో కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి సీఎం వి.నారాయ‌ణ స్వామి నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌రోనా తీవ్రత నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. బోర్డు ఎగ్జామ్స్ లేకుండానే అంద‌రినీ పాస్ చేసి పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. కాగా, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేసి స్టూడెంట్స్‌ను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story