పీఎస్‌ఎల్‌వీ-సీ 47 రాకెట్ ప్రయోగానికి సిద్ధం

ISRO
x
ISRO
Highlights

శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగం జరుపనున్నారు. హై రెజొల్యూషన్ ఇమేజింగ్

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోదనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 27న పీఎస్‌ఎల్వీ-సి-47 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్నది. దీని ద్వారా కార్బోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్శియల్ నానో శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. భూమిపై ఉన్న సమగ్ర సమాచారం..సాంకేతికతను నిరంతరం అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. దేశ సరిహద్దు భద్రతను ఉపగ్రహ నిగా వ్యవస్థతో మరింత పరిపుష్టం చేసే క్రమంలో ఇస్రో మూడు నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. ఈ నెల 27న పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీని ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

1625 కిలోల బరువు ఉన్న కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ద్వారా 14 ఉపగ్రహాలను 509 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. పోలార్ శాటిలైట్ లంచ్ వెహికిల్ స సిరీస్ లో ఇది 49వ ప్రయోగం కాగా.. షార్ నుంచి 74వ రాకెట్ ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ-47 ను ఎక్స్ ఎల్(XL) తరహాలో రూపొందించారు.

శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగం జరుపనున్నారు. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. ఐదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందించే కార్బోషాట్-3 రెండు వేల వాట్ల సామర్ధ్యం కలిగి ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం తర్వాత మరో రెండు ఉపగ్రహాలను షార్ నుంచి డిసెంబర్ లో ప్రయోగించే అవకాశం ఉన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories