కాసేపట్లో పిఎస్ఎల్వి- సి51 రాకెట్ ప్రయోగం

Delhi: మరికొద్ది సేపట్లో ప్రయోగించిన పిఎస్ఎల్వి- సి51 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది.

Kranthi
Published on: 28 Feb 2021 9:14 AM IST
PSLV-C51 rocket launch in Few minutes
X

ఫైల్ ఇమేజ్


Delhi: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరికొద్ది సేపట్లో ప్రయోగించిన పిఎస్ఎల్వి- సి51 రాకెట్ లో భారతదేశానికి చెందిన కొన్ని అమూల్యమైన చిత్రాలను, గ్రంధాన్ని, మహనీయుల చరిత్రల చిత్రాలను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతోంది. సతీష్ ధావన్ శాట్ పేరుతో రూపకల్పన చేసిన రెండు కేజీల బరువున్న ఈ చిన్ని ఉపగ్రహంలో దేశవిదేశాలకు చెందిన పలువురు మహనీయుల తో పాటు భారత ఇతిహాస గ్రంథాలను పంపుతోంది.. ఇందులో భరత ఇతిహాస గ్రంథం భగవద్గీత తోపాటు, దేశ ప్రధాని మోడీ ఛాయాచిత్రాలను ఉపగ్రహం ద్వారా రోదసిలోకి పంపుతోంది. అనేక విశేషాలతో కూడిన ఛాయాచిత్రాలను ఈ ఉపగ్రహం ద్వారా పంపుతున్నారు.యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే నిమిత్తం ప్రయోగం చేసినట్లు ఉపగ్రహ రూపకర్త డాక్టర్ కేశన్ తెలిపారు.

Kranthi

Kranthi

Next Story