Priyanka Vadra: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ప్రియాంకా వాద్రా ఆగ్రహం

Priyanka Vadra: బీజేపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచుతూనే ఉందని ప్రియాం వాద్రా మండిపడ్డారు.

Samba Siva Rao
Published on: 20 Feb 2021 7:17 PM IST
Priyanka Comments On Petrol Price
X

ప్రియాంక ఫైల్ ఫోటో (TheHansIndia)

దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అదుపు చేయడంతో మోదీ సర్కార్ విఫలమైందని విపక్షలు భారీ ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచుతూనే ఉందని కాంగ్రెస్‌ నేత ప్రియాం వాద్రా మండిపడ్డారు. యూపీలో ముజఫర్‌నగర్‌లో జరిగిన కిసాన్‌ పంచాయత్‌ సభలో పాల్గొన్న ప్రియాంక మోడీ సర్కార్‌పై పలు విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలు పెంచడం ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను ఏం చేస్తున్నారని ప్రియాంక(Priyanka Gandhi) ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడం ద్వారా వస్తున్న కోట్లాది రూపాయలను నిరుద్యోగులకు, రైతుల సంక్షేమానికి గానీ ఎందుకు ఖర్చు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story