Priyanka Gandhi: యోగి సర్కార్‌పై ప్రజలు విసుగెత్తిపోయారు

Priyanka Gandhi: యూపీలో గెలిచేది కాంగ్రెస్సే: ప్రియాంక గాంధీ

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 7:13 PM IST
Priyanka Gandhi Says Congress Participate Alone in Uttar Pradesh
X

ప్రియాంక గాంధీ (ఫైల్ ఇమేజ్)

Priyanka Gandhi: యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ కీలక ప్రకటన చేశారు. యూపీలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతోందని స్పష్టం చేశారు. యోగి పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారన్న ప్రియాంక ఈసారి అధికారంలోకి వచ్చేది తామే అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు 10వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు 2వేల 500, క్వింటాల్ చెరకుకు 400ల చొప్పున కొనుగోలు చేస్తామని అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story