PM Modi Twitter Followers: సోషల్ మీడియాలో ప్రధాని మోడీ హవా!

PM Modi Twitter Followers: సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ప్రపంచ రాజకీయ నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు.

Krishna
Updated on: 19 July 2020 6:33 PM IST
PM Modi Twitter Followers: సోషల్ మీడియాలో ప్రధాని మోడీ హవా!
X
Narendra Modi (File Photo)

PM Modi Twitter Followers: సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ప్రపంచ రాజకీయ నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు.. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం పలు అంశాల పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రధాని మోడీ! .. ఇక ఆయనని ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారి సంఖ్యలో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన మోడీ.. తాజాగా మరో ఘనతను సాధించారు. ఆదివారం(జూలై 19 2020) నాటికి ట్విటర్‌లో ప్రధాని మోదీని ఫాలో అయ్యే వారి సంఖ్య 60 మిలియన్లను దాటేసింది.

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన మొదటి ముగ్గురు నేతల్లో దేశ ప్రధాని మోదీ ఒకరు.. ఈ విషయాన్ని 2018 సంవత్సరంలో ఒక అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. ఇక ట్విటర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 120 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు 84 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్రధాని మోడీ 60 మిలియన్లతో కొనసాగుతున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోడీ ట్విట్టర్ ఖాతాలో చేరారు.. ఏడాది కాలం లోనే అంటే 2010లో ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక 2011 నవంబర్‌లో నాలుగు లక్షలకు చేరుకుంది. అలా క్రమంగా ఆ సంఖ్య ఇప్పటివరకూ 60 మిలియన్లను దాటేసింది. అటు మోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉండడం మరో విశేషం!


Krishna

Krishna

Next Story