Covid Vaccine: టీకా పంపిణీలో 100కోట్ల మార్క్ దాటిన భారత్

*రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని *వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మోడీ

Shilpa
Published on: 21 Oct 2021 1:18 PM IST
Prime Minister Narendra Modi Visits Vaccination Centre at Ram Manohar Lohia Hospital in Delhi
X

కోవిడ్  వాక్సిన్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Covid Vaccine: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ చేపట్టిన టీకా ఉద్యమం 100 కోట్ల మైలురాయిని దాటడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా నరేంద్ర మోడీ ఢిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ రికార్డుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సరికొత్త చరిత్ర లిఖించామని 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్పూర్తి, భారత సైన్స్, ఎంటర్‌ప్రైజ్ విజయాన్ని నేడు మనం చూస్తున్నామని అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన వైద్యులు, నర్సులు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Shilpa

Shilpa

Next Story