Narendra Modi: ఈ నెల 23 నుంచి 25 వరకు అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: ఈ నెల 25న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోడీ *కరోనా, తీవ్రవాదంపై ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం

Sandeep Reddy
Updated on: 10 Sept 2021 6:46 PM IST
Prime Minister Narendra Modi US Tour Confirmed
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ (ఫోటో: ది హన్స్ ఇండియా )

Narendra Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 25 వరకూ మోడీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోడీ కరోనా, తీవ్రవాదంపై ప్రసంగించనున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌ పై భారత వైఖరిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ఐరాసలో తీసుకురావాల్సిన సంస్కరణలను మోడీ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 23 లేదా 24న యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్‌తో ప్రధాని భేటీ కానున్నారు. ఇదే సమయంలో క్వాడ్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story