Narendra Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్

Narendra Modi: ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై చర్చించిన మోడీ.. యుద్ధం ఆపాలని పుతిన్‌ను ప్రధాని మోడీ సూచన

Rama Rao
Updated on: 25 Feb 2022 12:18 PM IST
Prime Minister Narendra Modi Calls Russian President Vladimir Putin
X

Narendra Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్

Narendra Modi: ఉక్రెయిన్ , రష్యా మధ్య బీకర యుద్ధం జరుగుతున్న వేళ ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక యుద్ధం ఆపాలని పుతిన్‌కు సూచించారు ప్రధాని మోడీ. ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవల పరిణామాల గురించి పుతిన్ ప్రధానికి వివరించారు. అయితే రష్యా, నాటో మధ్య ఉన్న విభేదాలు చర్చలు ద్వారానే పరిష్కరింబడతాయని ప్రధాని మోడీ సూచించారు.

ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి పుతిన్‌ మోడీకి వివరించారు. ఈ క్రమంలో నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలుకాలని విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. అదేవిధంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని ప్రధాని గుర్తు చేశారు.


Rama Rao

Rama Rao

Next Story