Modi: అబుదాబిలో ప్రధాని పర్యటన.. తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోడీ

Modi: స్వామినారాయణ్ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ

Jyothi
Published on: 14 Feb 2024 8:21 AM IST
Prime Minister Modi Visit to Abu Dhabi
X

Modi: అబుదాబిలో ప్రధాని పర్యటన.. తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోడీ

Modi: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయత, శిల్పకళ ఉట్టిపడేలా నిర్మితమైన ఈ ఆలయ ఉద్ఘాటన బుధవారం జరగనుంది. ప్రధాని మోడీ విశిష్ట అతిథిగా పాల్గొని, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇప్పటికే అబుదాబి చేరుకున్న ఆయనకు యూఏఈ గార్డ్స్‌ గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఇరువురు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

ఇక యూఏఈలో ప్రారంభానికి సిద్ధమైన 27 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన స్వామినారాయణ్‌ ఆలయంలో భారతీయ శిల్పకళాసౌందర్యం.. హిందూ ధర్మం ఉట్టిపడుతుంది. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఈ ఆలయం ఎత్తు 32.92 మీటర్లు, పొడవు 79.86 మీటర్లు, వెడల్పు 54.86 మీటర్లు. ఈ ఆలయానికి ఏడు గోపురాలున్నాయి. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ఈ గోపురాలు ప్రతీకగా బోచసన్వాసి శ్రీఅక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ వివరించింది. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌ నుంచి తెప్పించిన పాలరాతిని వినియోగించారు.

Jyothi

Jyothi

Next Story