PM Modi: నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్న ప్రధాని * రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం

Sandeep Eggoju
Updated on: 15 July 2021 1:07 PM IST
Prime Minister Modi Tour in Varanasi Today
X

వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన (ఫోటో : ఇండియన్ ఎక్ష్ప్రెస్స్)

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు దాదాపు రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లోని ఎంసీహెచ్‌లో 100 పడకల ఆసుపత్రితో పాటు మల్టీ పార్కింగ్‌, గంగా నదిలో పర్యాటకాభివృద్ధికి ఉద్దేశించిన రోరో బోట్లను ప్రధాని ప్రారంభించనున్నారు.

దీంతో పాటు వారణాసి- ఘాజీపూర్ జాతీయ రహదారిపై నిర్మించిన మూడు లైన్ల ఫ్లైఓవర్‌ వంతెనను ప్రారంభిస్తారు. అలాగే, మధ్యాహ్నం 12.15 గంటలకు జపాన్‌ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ 'రుద్రాక్ష్‌'ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు బీహెచ్‌యూలోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప్రధాని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత వైద్యులు, ఉన్నతాధికారులతో కరోనా సన్నద్ధతపై సమీక్షిస్తారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story