పీఎం జన్‌మన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: భారతదేశంలోని గిరిజనుల కోసం కొత్త పథకం

Jyothi
Published on: 15 Jan 2024 1:40 PM IST
Prime Minister Modi launched the PM Janman scheme
X

పీఎం జన్‌మన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: భారతదేశంలోని గిరిజనుల కోసం ప్రధాని మోడీ.. పీఎం జన్‌మన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్‌మన్‌ పథకం అమలుపై సమావేశంలో చర్చించారు. పీఎం ప్రారంభించిన కొత్త పథకంలో తొలి విడతలో 100 జిల్లాలను ఎంపిక చేశారు. అందులో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఈ పథకం అమలులో భాగంగా 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసి తెగలను గుర్తించి 24 వేల 104 కోట్ల రూపాయలు కేటాయించి.. లక్ష ఇండ్లను నిర్మించనుంది కేంద్ర ప్రభుత్వం.

Jyothi

Jyothi

Next Story