PM Modi: జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ

PM Modi: 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను వినియోగించిన దేశంగా భారత్ నిలిచింది

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 1:52 PM IST
Prime Minister Modi Addressing the Nation
X
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌లో భార‌త్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను వినియోగించిన దేశంగా భారత్ నిలిచింది. ఈ నేప‌థ్యంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోవడం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమ‌ని తెలిపారు. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ద్వారా దేశ శ‌క్తి ఏంటో ప్రపంచానికి చూపించామ‌ని చెప్పారు.

క‌ఠిన‌మైన ల‌క్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగ‌ల‌ద‌ని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పారు ప్రధాని మోడీ. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా టీకాలు అందించామ‌ని తెలిపారు. భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొన‌సాగింద‌ని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇప్పటికీ క‌రోనా జాగ్రత్తలు పాటించాల్సిందేన‌ని తెలిపారు.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story