Ramnath Kovind: రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారు.. ఇదే ఆఖరి శీతాకాల విడిది..

Ramnath Kovind: రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ వింటర్ సోజోర్న్ షెడ్యూల్ ఖరారైంది.

Arun Chilukuri
Published on: 21 Dec 2021 3:21 PM IST
President Ramnath Kovind to Visit Hyderabad on 29 December for Winter Sojourn
X

Ramnath Kovind: రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారు.. ఇదే ఆఖరి శీతాకాల విడిది..

Ramnath Kovind: రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ వింటర్ సోజోర్న్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 29 వ తేదీ నుంచి జనవరి 3 వ తేదీ వరకు రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ తన సదరన్ సోజోర్న్ లో భాగంగా హైదరాబాద్ రానున్నారు. దక్షిణ భారతంలో శీతాకాల విడిది కోసం ఆయన ఆరు రోజుల పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈమేరకు తెలంగాణా ప్రభుత్వానికి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ సమాచారం అందించింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఇక్కడ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈసారి కొత్త సంవత్సర వేడుకలను కూడా రాంనాథ్ కోవింద్ దక్షిణాదిలోనే జరుపుకోనున్నారు. సికింద్రాబాద్ బోల్లారంలోని రాష్ట్రపతి నిలయం భద్రతపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రపతిగా దక్షిణాదిలో రాంనాథ్ కోవింద్ కు ఇదే ఆఖరి శీతాకాల విడిది కానుంది. భారత 14 వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ పదవీకాలం జూన్ 2022తో ముగియనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story