Ramnath Kovind: ఒలింపిక్స్‌ భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు

Ramnath Kovind: రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించి, అభినందించిన రామ్‌నాథ్‌ కోవింద్‌

Sandeep Eggoju
Published on: 15 Aug 2021 8:29 AM IST
President of India Ramnath Kovind had a tea Party With the Medalists of the Tokyo Olympics
X

ఒలింపిక్స్ క్రీడా కారులకు తేంటి విందు ఇచ్చిన రాంనాథ్ కోవింద్ (ఫైల్ ఇమేజ్)

Ramnath Kovind: టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఒలింపిక్‌ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని అన్నారు. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులపై అభినందనలు కురిపించారు. వీరితోపాటు వారి కోచ్‌లు, సపోర్ట్‌ స్టాఫ్‌, సాయ్‌, క్రీడా సమాఖ్య అధికారులను కూడా ఆహ్వానించారు. ఇక ఇవాళ ప్రధాని మోడీ కూడా ఒలింపిక్స్ భారత క్రీడాకారులను మోదీ కలిసి మాట్లాడనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story