Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఇవాళ పోలింగ్

Karnataka: ఓటు హక్కును వినియోగించుకోనున్న 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు

Dhatripriya
Updated on: 10 May 2023 7:23 AM IST
Polling For Karnataka Elections Today
X

Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఇవాళ పోలింగ్

Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 224 స్థానాలకు గాను ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవిఎంలను పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులోని పోలింగ్ కేంద్రాలలో ఫేస్ రికాగ్నైజేషన్ అమలు చేయనున్నారు. మొత్తం 5 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు కాగా.. 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. అయితే, తొలిసారి 9లక్షల 17వేల మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story