M Venkaiah Naidu: రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయి

M Venkaiah Naidu: చట్టసభలకు ఎన్నికైన యువత ఆ చట్ట సభలకు గౌరవం తేవాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Jun 2024 4:28 PM IST
Politics is getting worse day by day Says M Venkaiah Naidu
X

M Venkaiah Naidu: రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయి

M Venkaiah Naidu: రాజకీయాలు రోజు రోజుకు దారుణంగా మారుతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదన్నారు. చట్టసభలకు ఎన్నికైన యువత ఆ చట్ట సభలకు గౌరవం తేవాలని, సిద్ధాంత పరమైన రాజకీయాలు చేయాలని సూచించారు. చట్ట సభల్లో హుందాగా మాట్లాడాలని వెంకయ్యనాయుడు హితవు పలికారు. పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలన్నారు. కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి కాదు గుణం చూసి ఓటు వెయ్యాలన్నారు. వ్యక్తి గుణం బట్టి, నడవడి బట్టి ఓటు వెయ్యకపోతే ప్రజాస్వామ్యనికి చేటు అన్నారు వెంకయ్య.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story