ఆటో కాగితాలు లేనందుకు 32,500 జరిమానా!

ఆటో కాగితాలు లేనందుకు 32,500 జరిమానా!
x
Highlights

కొత్త వాహన మోటారు చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. చిన్న పొరపాటుకు కూడా వేలాది రూపాయలు చలానా బారిన పడుతున్నారు వాహనదారులు. తన వాహనానికి...

కొత్త వాహన మోటారు చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. చిన్న పొరపాటుకు కూడా వేలాది రూపాయలు చలానా బారిన పడుతున్నారు వాహనదారులు. తన వాహనానికి సంబంధించిన కాగితాలు వాహనంతో తనతో పాటు ఉంచుకోక పోవడంతో అక్షరాలా 32,500 రూపాయల చలానా వేశారు పోలీసులు. ఈ సంఘటన గురుగ్రాం లో చోటుచేసుకుంది. అక్కడి ముస్తకిల్ అనే ఆటో డ్రైవర్ ఎదో తొందరలో తన ఆటోకి సంబంధించిన పేపర్స్ మర్చిపోయాడు. దారిలో పోలీసులు అతని ఆటోని ఆపారు. కాగితాలు బండి తో పాటు లేని కారణంగా అతనికి ఏకంగా 32,500 రూపాయల చలానా విధించారు. పది నిమిషాలు సమయం ఇవ్వమని బ్రతిమిలాడినా పోలీసులు వినలేదు.

ఇంతకీ చలానా లోని అంశాలు ఎలా వున్నాయో మీరూ తెలుసుకోండి.. లైసెన్స్ లేనందుకు ఐదు వేలు, ఆర్సీ లేనందుకు ఐదువేలు, ఇన్సూరెన్స్ లేనందుకు రెండు వేలరూపాయలు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేననుడుకు పదివేలు, సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేదని ఐదు వందలు, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నాడంటూ ఐదు వేలు, సిగ్నల్ జంప్ అంటూ మరో ఐదు వేలు.. వెరశి మొత్తం 32,500 రూపాయలు ఫైన్ పడింది. దీంతో మహమ్మద్ ముస్తాకిల్ లబోదిబో మంటున్నాడు. పదిహేనేళ్ళుగా ఇదే ఊరిలో ఉంటున్నా.. కొత్త నిబంధనల సంగతి తెలీదు. నా వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయి. కానీ, వాటిని బండిలో పెట్టుకోలేదు. ఇప్పుడు కోర్టులో జరిమానా రుసుము ఎమన్నా తగ్గిస్తారేమో చూడాలి అంటూ వాపోయాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories