Chhattisgarh: ఇంకా మావోయిస్టుల చేరలోనే PMGSY సబ్ ఇంజనీర్

* భర్త కోసం రెండేళ్ల కొడుకుతో అడవి బాట పట్టిన భార్య అర్పిత * ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఘటన

Shilpa
Published on: 14 Nov 2021 11:25 AM IST
PMGSY Sub Engineer Kidnapped by Maoists in Chhattisgarh
X

 ఇంకా మావోయిస్టుల చేరలోనే PMGSY సబ్ ఇంజనీర్(ఫైల్ ఫోటో)

Chhattisgarh: మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకునేందుకు అతని భార్య చంటి బిడ్డను చంకనేసుకుని అడవిబాట పట్టింది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మాన్‌కేళి, ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లిన సబ్ ఇంజనీర్, అటెండర్‌ను మావోయిస్టులు గురువారం కిడ్నాప్ చేశారు.

అనంతరం అటెండర్ లక్ష్మణ్‌ను మావోలు విడిచిపెట్టారు. అయితే సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్‌ను విడిపించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆందోళనకు గురైన భాధిత మహిళ తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ మావోయిస్టు ప్రాంతాన్ని వెతుక్కుంటూ అడవిబాట పట్టింది.

Shilpa

Shilpa

Next Story