Mann ki Baat: 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం

Mann ki Baat: 100 కోట్ల టీకా డోసుల పంపిణీపై కీలక వ్యాఖ్యలు

Sandeep Eggoju
Published on: 24 Oct 2021 3:52 PM IST
PM Narendra Modi Speech in Mann Ki Baat on Corona Vaccination
X

మాన్ కి బాత్ లో ప్రసంగించిన నరేంద్ర మోడీ (ఫైల్ ఇమేజ్)

Mann ki Baat: కోవిడ్ విషయంలో భారత్ అతిపెద్ద విజయం సొంతం చేసుకుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్‌ కీ బాత్‌ వేదికగా మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని ప్రధాని సూచించారు. సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం గొప్ప విషయం అన్నారు. 100 కోట్ల టీకా డోసుల పంపిణీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్‌లో సాధించిన ఘనత ప్రపంచానికి భారత్ సామర్ధ్యాన్ని చూపిస్తోందన్నారు. ఇదే సమయంలో హెల్త్ వర్కర్లపై మోడీ ప్రశంసలు కురిపించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి రక్షణగా నిలిచారని ప్రధాని కొనియాడారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story