PM Modi Letter: మూడో విడతలో పాల్గొనే బీజేపీ అభ్యర్థులకు మోడీ లేఖ

PM Modi Letter: సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా... మూడో విడతలో పోటీచేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖలు రాశారు.

Arun Chilukuri
Published on: 30 April 2024 4:37 PM IST
PM Modis Letter to Phase 3 BJP Candidates
X

PM Modi Letter: మూడో విడతలో పాల్గొనే బీజేపీ అభ్యర్థులకు మోడీ లేఖ

PM Modi Letter: సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా... మూడో విడతలో పోటీచేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖలు రాశారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ఈ లేఖ ద్వారా సూచించారు మోడీ. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం ఇండియా బ్లాక్ చేస్తోందని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెరలేపిందని అన్నారు. ఇలాంటివి రాజ్యాంగ విరుద్దమన్నారు. బీజేపీకి దక్కే ప్రతి ఓటు బలమైన ప్రభుత్వ ఏర్పాటు... 2047 వరకు దేశాన్ని మరింత అభివృద్ది చేసే దిశగా నడిపిస్తాయని తెలిపారు. ఓటర్ దేవుళ్ల ఆశీర్వాదంతో గెలిచివచ్చే మీతో మళ్లీ కలిసి పనిచేస్తానని అభ్యర్థులకు రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రధాని.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story