PM Modi: గోవా డాక్టర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

PM Modi: ప్రతి పక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు

Sandeep Eggoju
Published on: 18 Sept 2021 2:52 PM IST
PM Modi Video Conference With Goa Doctors
X

గోవా డాక్టర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ (ఫైల్ ఇమేజ్)

PM Modi: దేశంలో రికార్డ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒకే రోజు రెండున్నర కోట్లకు పైగా టీకాలు అందించడంపై విపక్షాలు విమర్శలు గుప్పించిన అంశంపై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోవా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమైన మోడీ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలిసిందని అయితే, నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని తెలిసి ప్రతిపక్షాలకు జ్వరం పట్టుకుందన్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చంటూ ఓ వైద్యుడిని అడగడంతో దానికి డాక్టర్ సైతం చిరునవ్వులు చిందించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story